11 March, 2026 | 1:07 AM

పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించండి

10-03-2026 03:46 PM

ఎమ్మెల్యేను కలిసిన బిజెపి కౌన్సిలర్లు. 

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ సహకరించాలని భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కోరారు . మంగళవారం ఎమ్మెల్యే నివాసానికి బిజెపి కౌన్సిలర్లు అంతారం కిరణ్ కుమార్ ,నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి లు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి తాండూరు అభివృద్ధి కోసం చర్చించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని అందుకు గాను బిజెపి కౌన్సిలర్లు కూడా సహకరించాలని కోరారు..