2 May, 2026 | 8:52 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు

02-05-2026 07:23 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ సిఐగా విధులు నిర్వహిస్తున్న గట్ల మహేందర్ రెడ్డి డీఎస్పీగా పదోన్నతి లభించిన సందర్భంగా, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ డీఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్ రెడ్డి కి స్టార్ బహుకరించి అభినందించారు. కొత్తగా నిర్వర్తించే బాధ్యతల్లో మరింత ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. శాఖలో క్రమశిక్షణ, సేవా భావం, ప్రజల పట్ల బాధ్యతతో పనిచేస్తూ ఉన్నత స్థానాలను అధిరోహించడం ప్రతి పోలీస్ అధికారి లక్ష్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.