10 May, 2026 | 2:37 AM

అమెరికా చర్చలకు సిద్ధం

10-05-2026 01:33 AM
  1. 14 పాయింట్ల ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశం
  2. ప్రకటన కోసం ఎదురుచూస్తున్న ట్రంప్
  3. హర్మూజ్‌లో కలగజేసుకుంటే తీవ్ర పరిణామాలన్న ఇరాన్ యూఎన్ ప్రతినిధి

వాషింగ్టన్, మే 9: పశ్చిమాసియాలో సం ఘర్షణను ముగించడమే లక్ష్యంగా మరోసారి కీలక ముందడుగు పడింది. అమెరికా. ఇరాన్‌లు మరోసారి ఇస్లామాబాద్‌లో చర్చలకు సిద్ధమయ్యాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సంఘర్షణ ముగింపు పలకడమే 14 పాయింట్ల అవగాహన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశం ఉందని ఆ కథనాలు వెల్లడించాయి. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం, దానివద్ద ఉన్న యురేనియం నిల్వల బదిలీ, హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను తగ్గించడం వంటి కీలక విషయాలున్నాయి.

తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని టెహ్రాన్ ముందునుంచీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ చర్చలకు ఇవే అడ్డంకిగా మా రాయి. చర్చలు సానుకూలంగా సాగితే ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం మరికొంతకాలం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘ ర్షణ ముగింపుపై ఇరాన్ నుంచి ప్రకటన వస్తుందని ట్రంప్ ఎదురుచూస్తున్నారు. హ ర్మూజ్‌లో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చేపట్టిన ‘ప్రా జెక్ట్ ఫ్రీడమ్’ను తిరిగి పునరుద్ధరించే విషయాన్ని తమ యంత్రాంగం పరిశీలిస్తుందని పేర్కొన్నారు.

ఇరాన్ ఒప్పందంపై సంతకం చేయకపోతే నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు మరికొన్ని చర్యల ను కూడా చేపడతామని ట్రంప్ ప్రకటించారు. కాగా దీనిపై ఇరాన్ స్పందిస్తూ హ ర్మూజ్ జలసంధిలో యూఎస్ తన సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యూఎ న్‌లోని ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ స యీద్ హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్ర మం, యురేనియం విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని అమీర్ స్పష్టం చేశారు.