22 March, 2026 | 10:34 AM

ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థులు

08-10-2025 12:27 AM

వెల్దండ అక్టోబర్ 7 రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నుంచి జిల్లా ప్రాదేశిక సభ్యుల వరకు భాజవా అభ్యర్థులు బరిలో ఉంటారని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి స్పష్టం చేశారు. వెల్దండ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్ర, దేశ స్థాయిలో అధికారంలోకి రాగలమన్నారు. చైర్మన్ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జంగయ్య, శేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకటయ్య, అంజిరెడ్డి, దాస్ తదితరులు పాల్గొన్నారు.