5 April, 2026 | 6:30 AM

బిష్ణోయ్ తిప్పేసాడు

05-04-2026 01:43 AM
  1. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విక్టరీ

గెలుపు ముంగిట గుజరాత్ బోల్తా

4 వికెట్లతో బిష్ణోయ్ స్పిన్ మ్యాజిక్

211 పరుగుల టార్గెట్... ఆరంభం అదిరింది.. మధ్యలో స్పిన్ కు వికెట్లు పడ్డాయి.. కీలక బ్యాటర్లు ధాటిగా ఆడినా కీలక సమయంలో ఔటయ్యారు...గుజరాత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివర్లో రషీద్ ఖాన్, రబాడ అద్భుత పోరాటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. చివరి ఓవర్ ను దేశ్ పాండే అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గట్టెక్కింది. 

అహ్మదాబాద్, ఏప్రిల్ 4 : ఐపీఎల్ 19వ సీజన్ కు ఊపొచ్చింది. చివరి బంతి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత పోరాటంతో గెలుపును సొంతం చేసుకుం ది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 6.1 ఓవర్లలోనే 70 ప రుగులు జోడించా రు. మరో హాఫ్ సెంచరీ చేస్తాడనుకున్న వైభవ్ 18 బంతుల్లో 31 (5 ఫోర్లు,1 సిక్సర్ ) పరుగులకు ఔటయ్యాడు. మరోవైపు జైస్వాల్ కూడా దుమ్మురేపాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.

జురెల్‌తో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక్కడ నుంచీ రియాన్ పరాగ్ (8), హెట్ మెయిర్ (18), ఫెరీరా (1) వెంటవెంటనే ఔటయ్యారు. అయితే మరో ఎండ్ లో ధృవ్ జురెల్ మాత్రం దూకుడుగా ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ కూడా ధాటిగా నే ఆడింది.

ఓపెనర్లు కుమార కుషాగ్ర, సాయి సుదర్శన్ తొలి ఓవర్ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ 8 ఓవర్లలో 78 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ రవి బిష్ణోయ్ వరుస ఓవర్లలో  సాయి సుదర్శన్ 73 ( 9 ఫోర్లు,3 సిక్సర్లు) , గ్లెన్ ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్ (4), తెవాటియాలను ఔట్ చేశాడు.  రషీద్ ఖాన్, రబాడ  ఏడో వికెట్ కు 43 పరుగులు జోడించారు. ఇక్కడ ఏదైనా అద్భు తం జరుగుతుందేమో అనిపించింది. అ యితే 19వ ఓవర్ ను ఆర్చర్, 20 ఓవర్ ను తుషార్ దేశ్ పాండే అద్భుతంగా బౌ లింగ్ చేయడంతో గుజరాత్ 204 పరుగులకే పరిమితమైంది. రవి బిష్ణోయ్ 4 వికెట్లతో గుజరాత్ ను దెబ్బకొట్టాడు.

స్కోరు బోర్డు

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: 210/6 ( జురెల్ 75 , జైస్వాల్  55, వైభవ్ సూర్యవంశీ 31 ; రబాడ 2/42, సిరాజ్ 1/48 )

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: 204/8 ( సాయి సుదర్శన్ 73, బట్లర్ 26, రషీద్‌ఖాన్ 24; బిష్ణోయ్ 4/41, బర్గర్ 1/29)