5 April, 2026 | 6:27 AM

స్వదేశానికి వెళ్లిపోయిన కమిన్స్

05-04-2026 01:41 AM

ఏప్రిల్ 17న తిరిగి వచ్చే ఛాన్స్

ముంబై, ఏప్రిల్ 4 : కేకేఆర్‌పై విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊ హించని షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు పాట్ కమ్మిన్స్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. మొన్నటి వరకు ఇండియాలోనే ఉన్న కమ్మిన్స్, గాయం కారణంగా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. వెన్ను నొప్పి నుంచి కోటుకుంటోన్న ఆ ఆసీస్ కెప్టెన్ రెస్ట్ తీసుకుంటున్నాడు.వచ్చే వారం నుంచి అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని అభిమానులందరూ అంచనా వేసుకున్నా రు. అయితే ఈ అంచనాలను తలకిందు లు చేస్తూ పాట్ కమ్మిన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 

ఫైనల్ మెడికల్ స్కానింగ్ ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆదేశాల తోనే తిరుగు ప్రయాణం అయ్యాడు. అయి తే ఆస్ట్రేలియా వెళ్లిపోయిన కమ్మిన్స్ ఈ నెల 17వ తేదీన మళ్లీ ఇండియాకు రానున్నాడు. సరైన బౌలింగ్ లైనప్ లేని తరుణంలో కమ్మిన్స్ ఇలా ఆస్ట్రేలియాకు వెళ్లడం సన్‌రైజర్స్ అభిమానులకు కొత్త టెన్షన్ నెలకొంది. త్వరగా అతను కోలుకుని జట్టులోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సన్‌రైజర్స్ ఆడే తర్వాతి మూడు మ్యాచ్‌లకు కమ్మిన్స్ అందుబాటులో ఉండడు. అప్పటివరకు ఎస్‌ఆర్‌హెచ్‌ను తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ.. రెండో మ్యాచ్ లో అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాను 65 పరుగుల తేడాతో ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానం లో కొనసాగుతోంది.