29 August, 2026 | 3:20 PM

రక్తదాతలకు సర్టిఫికేట్ల పంపిణీ

29-08-2026 02:19 PM

ధర్మపురి,ఆగస్టు27 (విజయక్రాంతి): వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెరుగు నరేష్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా వెల్గటూర్ లో రక్తదాన శిభిరం నిర్వహించారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలకు ఈ సందర్బంగా మండల వైద్యాధికారి తేజశ్రీ, గ్రామ సర్పంచ్ బండమీది కవిత గోపి సర్టిఫికేట్లు అందించారు.రక్తదానం ఎంతో మంది రోగులకు ప్రాణదానంగా నిలుస్తుందని, జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్బంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరగడ్డ సంతోష్, వనపర్తి తిరుపతి, విరన్, ఎనగందుల నరేష్, మూగల సత్యం తదితరులు పాల్గొన్నారు.