29 August, 2026 | 4:13 PM

శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ

29-08-2026 03:11 PM

ములకలపల్లి, ఆగస్టు 28 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసు అభ్యర్థుల శిక్షణ కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ములకలపల్లి ఎస్ఐ మధు ప్రసాద్ శనివారం తెలిపారు. పోలీస్ శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థుల కోసం శిక్షణా శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

దీనికోసం ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 31 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి ఆయా వ్యక్తులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.అర్హత పొందినటువంటి అభ్యర్థులకు కొత్తగూడెంలో నిర్వహించే శిక్షణ తరగతులకు పంపడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.