కౌశిక్ రెడ్డి తీరుపై ఎథిక్స్ కమిటీ విచారణ
ముగిసిన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో(Telangana Assembly committee hall) కమిటీ చైర్మన్ రేవురి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ సమావేశం(Ethics Committee meeting) జరిగింది. మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ(Ethics Committee) సమగ్ర విచారణ జరిగిపింది. కౌశిక్ రెడ్డి తరుపున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డిపై అభియోగాలు వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. చేయి చూపించి బెదిరించారని కౌశిక్ రెడ్డిపై(Kaushik Reddy) ఒక అభియోగం మోపారు. అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ సభ్యులు మరో అభియోగం చేశారు. ఇతర సభ్యుల వ్యాఖ్యలనూ పరిగణలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ తెలిపింది. కౌశిక్ రెడ్డిపై అభియోగాలు వెనక్కి తీసుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.
వీడియోలో సైగలు తప్ప వాయిస్ లేదని బీఆర్ఎస్ సభ్యులు(BRS MLAs) స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి తప్పు లేకుంటే మరో అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కమిటీని కోరారు. సభ హుందాతనాన్ని గౌరవించాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కావొద్దంటే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ లోపల కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. వచ్చే సమావేశానికి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిని పిలవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. బీఆర్ఎస్ హయాంలో సంపత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేసిన అంశాన్ని కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించారు. వచ్చే సమావేశానికి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిని పిలిపించాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది.






