29 August, 2026 | 3:58 PM

ప్రతిపక్షాలు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు

29-08-2026 03:00 PM

సూర్యాపేటలో సీలింగ్ పట్టాలను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి 

సూర్యాపేట : భూభారతి(Bhu Bharathi) తెచ్చాక అన్ని సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. భూభారతి చట్టంతో ప్రజాప్రభుత్వం రైతులకు యాజమాన్య హక్కులు కల్పించింది. సూర్యాపేట జిల్లా నూతనకల్, మందిరాల మండలాల రైతులకు సీలింగ్ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ తో పాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుందని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎవరికి సంక్షేమ పథకాల ఫలాలు అందలేదన్నారు. ప్రతిపక్షాలు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు చెబుతున్నాయని ఆరోపించారు. పేదలే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే తట్టుకోలేక విషం చిమ్ముతున్నారని పొంగులేటి సూచించారు. ఆర్టీసీ ఆస్తులను ప్రజలకు పంచుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.