29 August, 2026 | 3:06 PM

సాగునీటి విషయంలో నియోజకవర్గ రైతాంగానికి అన్యాయం

29-08-2026 02:17 PM

బోథ్. ఆగస్టు 30 (విజయ క్రాంతి): నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని నల్ల జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్లో సాగునీటి రంగానికి 23 వేల కోట్ల రూపాయలు కేటాయించిన నిధులు వినియోగించలేదు అన్నారు. తిప్పిరి తేజపూర్ బుగ్గారం లిఫ్ట్ ఇరిగేషన్ల అభివృద్ధి పనులు చేపట్టలేదు అన్నారు. నారాయణపూర్ అందూర్ చెరువుల మంజూరు చేసినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు లేక పనులు జరగలేదన్నారు.

ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వల్ల 70 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని గతంలో ప్రభుత్వం ముందు ఉంచారని అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది టిఎంసిలతో ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కుప్తి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని పేర్కొన్నా ఇప్పటివరకు ముందు అడుగు పడలేదన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులకు బుద్ధి చెప్తారని విమర్శించారు.