18 June, 2026 | 2:50 AM

ఇందిరమ్మ గృహ నిర్మాణానికి భూమిపూజ

18-06-2026 01:29 AM

తాడ్వాయి, జూన్, 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి నందివాడ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ గృహ నిర్మాణానికి ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మద న్మోహన్ రావు ఆదేశాల మేరకు గ్రామంలోని మురంగి మమత ఇందిరమ్మ గృహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ షౌకత్ అలీ, నాయకులు బాల సాయిలు, మోహన్ రెడ్డి, అఖిల్ రావు, శ్రీకాంత్, నరేష్, పండరి తదితరులు పాల్గొన్నారు.