17 May, 2026 | 8:48 AM

గంగమ్మకు భవానీ భక్తుల హారతి..

29-09-2025 12:39 AM

* శాంతించమ్మా గంగమ్మా అంటూ వేడుకోలు 

పాపన్నపేట, సెప్టెంబర్ 28 :సింగూరు నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల నీరు రావడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చెందిన దుర్గాభవాని మాల దారులు ఆ గ్రామ శివారులోని మంజీరాకు హారతినిచ్చారు. ‘శాంతించమ్మా గంగమ్మా‘ అంటూ వేడుకున్నారు.