21 May, 2026 | 2:41 AM

భట్రాజులు రాజకీయంగా ఎదగాలి

21-05-2026 01:24 AM

బహుజన రాజకీయ శక్తిగా ఎదిగితేనే ఎమ్మెల్యేలవుతారు 

మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు

ముషీరాబాద్, మే 20 (విజయక్రాంతి): రాజకీయంగా గెలిచినప్పుడే భట్రాజు సమాజానికి నిజమైన గౌరవం, సామాజిక న్యా యం దక్కుతుందని మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అన్నారు. బుధవారం తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బీసీ టైమ్స్, బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భట్రాజు ప్రజాప్రతినిధుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి బీసీ సమా జ్ రాష్ట్ర కార్యదర్శి సంగెం సూర్యారావు అధ్యక్షత వహించి, సభకు దిశానిర్దేశం చేశారు. భట్రాజు సమాజం రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎలా ఎదగాలనే అంశాలపై ఆయన స్పష్టమైన మార్గదర్శక త్వం ఇచ్చారు. సమాజంలోని మేధావులు, ప్రజాప్రతినిధులు, యువత ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభ లో తెలంగాణ భట్రాజుల అసోసియేషన్ ప్రెసిడెంట్ చుక్కల బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు దేవరాజు విష్ణువర్ధనరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతికంఠం పూర్ణచంద్రరాజు, రా మరాజు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు, యువ నాయకులు పాల్గొన్నారు.

డాక్టర్ పూ ర్ణచంద్రరావు మాట్లాడుతూ వెలమలెంతమందో భట్రాజులూ అంతే మంది ఉన్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు 13 మంది వెలమ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క భట్రాజు ఎమ్మెల్యే కూడా లేరు. ఎందుకు ఈ పరిస్థితి? అని ప్రశ్నించారు.

కమ్మ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు 73 మంది ఎమ్మెల్యేలయ్యారని, ప్రస్తుత అసెంబ్లీలో కూడా 4గురు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు.రెడ్డి సామాజిక వర్గం నుంచి చరిత్రలో 576 మం ది ఎమ్మెల్యేలయ్యారని, ఈసారి ఒక్క అసెంబ్లీలోనే 40 మంది ఎన్నికయ్యారని చెప్పారు. ‘రెడ్డి, వెలమ, కమ్మ ఈ మూడు పాలక కులాల ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీ సగం నిండిపోతోంది.

కానీ భట్రాజులకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇది అన్యాయం కాదా?’ అని ప్రశ్నించారు. భట్రాజు సమాజం వాక్ ధార కళలో, సాహిత్యంలో గొప్ప చరిత్ర కలిగినా రాజకీయ అధికారంలో మాత్రం పూర్తిగా వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇతరులను గెలిపించే సమాజంగా ఉంటే ఇలాగే ఉంటుంది. మనం అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి’ అన్నారు.

‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజకీయ అధికారమే సామాజిక మార్పుకు తాళం చెవి’ అన్న మాటలను గుర్తు చేస్తూ  జ్యోతిరావు ఫూలే విద్యా చైతన్యాన్ని, కాన్షీరాం బహుజన రాజకీయాలను భట్రాజు యువత అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.ఎప్పుడూ పాలక కులాల పార్టీల జెండాలు మోస్తూ ఉంటే భట్రాజులకు అధికారంలో వాటా రాదు. సాటి బీసీలు, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలతో చేతులు కలిపి బహుజన రాజకీయ శక్తిగా ఎదిగితేనే భట్రాజులు ఎమ్మెల్యేలు అవుతారు అని అన్నారు. భట్రాజు యువత విద్య, సంఘటితం, రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.