27 April, 2026 | 11:52 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

కాళేశ్వరంలో ప్రముఖుల దర్శనం

13-02-2026 12:29 AM

కాళేశ్వరం, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని పలు వురు ప్రముఖులు దర్శించుకున్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వొడ్డేపల్లి రాం చందర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అ ర్చకులు వారికి మర్యాదపూర్వక స్వాగతం పలికి, స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

అనంతరం అమ్మవారి ఆలయంలో దర్శనం చేయించి, అర్చకులు స్వా మివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ గంగాధర్ కూ డా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనం అనంతరం శేష వస్త్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.