2 September, 2026 | 2:05 AM

అబ్బాస్ ఖాన్‌కు భారత్ యూత్ అవార్డు

02-09-2026 | 12:00am

తెలంగాణ ఈక్వెస్ట్రియన్ అథ్లెట్‌కు అరుదైన గౌరవం

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణకు చెందిన ఈక్వెస్ట్రియన్ అథ్లెట్ అబ్బాస్ ఖాన్(Abbas Khan)కు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందించేప్రతిష్టాత్మక భారత్ యూత్ అవార్డు(Bharat Youth Award) 2026కు ఈ యువ అథ్లెట్ ఎంపికయ్యాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ షోజంపింగ్ అథ్లెట్‌గా నిలిచాడు.

డెహ్రాడూన్‌లో జరిగిన ఒక విశిష్ట వేడుకలో ఉత్తరాఖండ్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ గుర్మిట్ సింగ్ ఈక్వెస్ట్రియన్ క్రీడలో అబ్బాస్ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే అబ్బాస్ ఖాన్ షోజంపింగ్ కేటగిరీలో, అంతర్జాతీయంగా పోటీ పడుతూ, విదేశాలలో ప్రతిష్టాత్మక విజయాలు సాధించాడు. 

జూనియర్ నేషనల్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్ (2015)లో 7 స్వర్ణాలతో సహా 11 పతకాలు గెలిచాడు. గత ఐదేళ్లలో అబ్బాస్ ఖాన్ ఏడు యూరోపియన్ దేశాలలో జరిగిన పోటీలకు సంబంధించి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన డచ్ మాస్టర్స్ లో మూడో స్థానం, గ్రాండ్ ప్రీలో నాలుగో స్థానం, డెన్మార్క్ గ్రాండ్ ప్రీలో ఆరో స్థానం, స్పెయిన్ లో మూడో స్థానం, బెల్జియం గ్రాండ్ ప్రీలో ఏడో స్థానంలో నిలిచాడు.