రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
నాగిరెడ్డిపేట్, జూన్ 18 (విజయక్రాంతి): మండలంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని డిఎంహెచ్‌ఓ జె.వెంకటి సందర్శించారు.ఈ సందర్భంగా డీఎంహెచ్వో జే. వెంకటి ఆస్పత్రిలోని సౌకర్యాలు, రోగుల సంరక్షణ, మందుల లభ్యత మరియు పారిశుద్ధ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, నాగిరెడ్డిపేట్ మండల ప్రాథమిక వైద్య కేంద్రాన్ని పరిశుభ్రంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
అనంతరం మీడియా బృందం పిహెచ్సిని సందర్శించి వైద్యాధికారి మరియు సిబ్బందితో సేవలు, మందుల సరఫరా, పారిశు ద్ధంపై చర్చించారు. డీఎంహెచ్వో జే.వెంకటి సిబ్బందితో మాట్లాడి రోగి సంరక్షణ పిహెచ్సి నిర్వాణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘటించారు. సీజనల్ డిసీస్ మరియు డయోరియా గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ప్రభుత్వ వైద్యాధికారి సృజన్ కుమార్, సూపర్వైజర్ సునంద,సుభాషిని, అనిల్ డేవిడ్,ఎల్టి గణేష్,స్టాఫ్ నర్స్ మానస, మెయిల్ వర్కర్ మురళీకృష్ణ ఉన్నారు.






