19 June, 2026 | 3:13 AM

విన్నాక్స్ హ్యాకథాన్ 2026లో జ్యోతిష్మతి విద్యార్థులకు ప్రథమ బహుమతి

19-06-2026 02:09 AM

తిమ్మాపూర్, జూన్ 18 (విజయక్రాంతి): తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి విద్యా సంస్థకు చెందిన ఫైనల్ ఇయర్ బి.టెక్ విద్యార్థులు స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, హైదరాబాద్ లో నిర్వహించిన విన్నాక్స్ హ్యాకథాన్2026 లో ప్రథమ బహుమతిని సాధించారు.

ఈ హ్యాకథాన్ ఈనెల 12, 13 నిర్వహించగా షేక్ జోహెబ్ ఉర్ రెహ్మాన్, పానుగంటి వర్షిణి తమ వినూత్న ప్రాజెక్టు స్మార్ట్ సోలార్ అం బ్రెల్లాతో సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకొని ప్రథమ స్థానం తో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జువ్వాడి సా గర్ రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్, ఆడిట్ డాక్టర్ పీకే వైశాలి, సీఎస్‌ఈ విభాగాధిపతి డాక్టర్ ఆర్ జగదీశన్ విద్యార్థులను అభినందించారు.