13 March, 2026 | 4:12 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

12-03-2026 12:14 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట మార్చి 11 : ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్తిస్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఉచిత వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, గైనకాలజీ, డెంటల్, ఆఫ్తాల్మాలజీ వంటి వైద్య శిబిరాన్ని పరిశీలన చేస్తూ వైద్యులతో ప్రజలకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళ సంఘాల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పౌష్టికాహారం తయారు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

అదేవిదంగా మండల కేంద్రంలో ఇటీవల మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి. వెంకటన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మండల కేంద్ర పరిధిలోని ఎమ్మెల్యే సమక్షంలో బండ్రవల్లి గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ గోపాల్ , రాజు చారి , రామచంద్రయ్య,అప్పరాల గ్రామానికి చెందిన అడ్వొకేట్ నాగిరెడ్డి తదితరులు ఎమ్మెల్యే జియంఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

లాల్ కోట గ్రామంలో 30 లక్షల నిధులతో ఆహార ధాన్యాల నిల్వ కేంద్రం (గోడౌన్) నిర్మాణానికి రూ 12 లక్షల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణానికి మరియు రూ 10 లక్షల నిధులతో మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ చేశారు. మంగలి కొండప్ప, ఇమామ్ గార్ల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం లో పాల్గొన్నారు.  14 మంది కి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.