ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బంగారు బాబుపై ఐటీ విచారణ
- ఒంటిపై ఉన్న అధిక బంగారం వివరాలపై ఆరా
- పత్రాలు చూపించాలని సూచన
- విచారణ అనంతరం కార్యక్రమానికి అనుమతి
శేరిలింగంపల్లి,మార్చి 27 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమ్పా ఆదాయపన్ను అధికారులు విచారణ నిర్వహించారు. డిల్లీలో నిర్వహించిన హాకీ 8వ జాతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన సమయంలో మొదట హైదరాబాద్ విమానాశ్రయంలోనే ఆయనను నిలిపి వివరాలు అడిగినట్లు సమాచారం.
న్యూఢిల్లీలో దిగిన అనంతరం కూడా అక్కడి అధికారులు ఆయనను ప్రశ్నించి, తన వద్ద ఉన్న బంగారం పరిమాణంపై వివరాలు తెలుసుకున్నారు. నిర్దిష్ట పరిమితికి మించి బంగారం కలిగి ఉండటంతో సంబంధిత పత్రాలు సమర్పించాలని సూచించినట్లు తెలిసింది. అధికారులు విచారణలో భాగం గా బంగారాన్ని తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకుని, అవసరమైన ధృవపత్రాలు చూపించిన తర్వాత తిరిగి పొందాలని అధికారులు కోరినట్లు సమాచారం.
విచారణ పూర్తయ్యాక ఆయనకు హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో అవసరమైతే విచారణకు హాజరు కావాలని కూడా అధికారులు సూచించినట్లు తెలిపారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు అతిశయోక్తిగా ఉన్నాయని,ప్రజలు వాటిని నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.




