calender_icon.png 20 February, 2026 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చనిపోయిన వారి బెనిఫిట్స్ ఇవ్వాలి

20-02-2026 12:00:00 AM

మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్‌కు తపస్ విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): విధి నిర్వహణలో చనిపోయిన మోడల్ స్కూల్ ఉపాధ్యాయ కుటుంబాలకు రావాలసిన బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధానకార్యదర్శి పెంటయ్య విజ్ఞప్తి చేశారు.

ఈమేరకు తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస చారిని గురువారం కలిసి ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతుల్లో జీతాలు ఇవ్వాలని కోరారు. టీజీటీల 43 ఫిట్‌మెంట్, ఏరియర్స్ తదితర సమస్యలను అడిషనల్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలోనే ఇవన్నీ పరిష్కారమ య్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.