7 July, 2026 | 2:54 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

పాలకశక్తిగా బీసీలు ఎదగాలి

20-04-2026 02:32 AM
  1. అధికారంలో ప్రాతినిథ్యం లేకపోవడం దురదృష్టకరం
  2. ‘మాస్’ బీసీ జన జాగరణ జాతర సభలో టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న
  3. రాజ్యాధికార కలలు సాకారం అవుతాయి: ఎంపీ ఈటల రాజేందర్

సికింద్రాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): దేశంలో, రాష్ట్రంలో బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అధికారంలో మాత్రం తగిన ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని టీఆర్పీ (తెలంగాణ రాజ్యాధికార పార్టీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలు కేవలం ఓటుబ్యాంకుగా కాకుండా పాలకశక్తిగా ఎదగాల్సిన సమ యం, అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మేధావులు అంతా ఒకతాటి మీదకు వచ్చినట్లుగా కనిపిస్తుందని బీసీలు కన్న కలలు రాజ్యాధికారం తప్పకుండా సఫలం అవుతుందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మాస్ (మన ఆలోచన సాధన సమితి) ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ జన జాగరణ జాతర సభలో తీన్మార్ మల్లన్న, ఈటెల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు.

టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీల రాజకీయ సాధికారత చైతన్యం కల్పించే దిశగా ఈ వేదిక నిలవడం సంతోషకరమన్నారు. బీసీలకు చారిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని వివరించారు. బీసీల రాజ్యాధికారమే సమానత్వ సమాజానికి బాసటగా నిలుస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి, రాజకీయ శక్తి అత్యవసరమని, అంతా ఒక్కటై ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. మన ఆలోచన సాధన సమితి జాతర ఆశయం స్ఫూర్తి కి సంపూర్ణ మద్దతు అందిస్తానని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేంద ర్ అన్నారు. ప్రతీ ఒక్కరి గుండెల్లో బీసీల ఉద్యమం ఫరిడవిల్లుతుందని, సమయం వచ్చినప్పుడు ఆవిష్కరిస్తారని చెప్పారు.