20 April, 2026 | 4:13 AM

టీఆర్పీ ఒత్తిడితోనే కులగణన లెక్కలు బహిర్గతం

20-04-2026 02:34 AM
  1. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సన్మానం

ప్రజల నమ్మకంతోనే పార్టీ బలోపేతం: మల్లన్న

హైదరాబాద్, ఏప్రిల్ 19: కులగణన లెక్కలు బహిర్గతమవడంలో టీఆర్‌పీ (తెలంగాణ రాజ్యాధికార పార్టీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోరాటం, కృషి ఉందని ఆ పార్టీ నాయకులు ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొ న్నారు. టీఆర్పీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్నకు శాలువాకప్పి సన్మానించి, పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వివిధ వేదికలపై పదేపదే కులగణన అంశాలను ప్రస్తావించడంతోనే లెక్కలు ప్రజల ముందుకు వచ్చాయన్నారు.

మల్లన్న నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్, ఉపాధ్యక్షలు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, క్రమశిక్ష ణా కమిటీ చైర్మన్ బండారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు గంగాధర్ లింగాల, పసుల ప్రసన్న కుమారి, కొమ్ముల ప్రవీణ్, బొడ్డుపల్లి చంద్ర శేఖర్, మార్త శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

టీఆర్పీలో చేరికలు..

ఇబ్రహీంపట్నంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల మనీష్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా మల్లన్న వారికి పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న పోరాటమే తమను ఆకర్షించిందని చేరినవారు ప్రకటించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. ప్రజల నమ్మకంతోనే పార్టీ బలపడుతుందని అన్నారు.

ప్రజాపక్షాన నిలుస్తూ, వారి హక్కుల కోసం నిరంతరం టీఆర్పీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతీఒక్కరికీ గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో పార్టీపై రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, ఈ చేరికలు మరింత పార్టీ బలోపేతం చేస్తాయని నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల మనీష్ పటేల్ అన్నారు.