2 July, 2026 | 3:30 AM

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

02-07-2026 02:11 AM

బోయినపల్లి: జూలై 1 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారురాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ’రైతు భరోసా’ పథకం కింద ఏకంగా రూ. 9,000 కోట్ల భారీ నిధులను విడుదల చేయడంపై రైతాంగంతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నెలకొన్నది.

ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సువీన్ యాదవ్  డీసీఎంఎస్  మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సువిన్ యాదవు సర్పంచులు నల్ల మోహన్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ బాలగోని వెంకటేష్ , సంబ లచ్చయ్య, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ  నాయకులు పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, మైలారం శ్రీనివాసు, గుంటి తిరుపతి, బోయిని మల్లేశం, దూస జనార్దన్, ఒంటెల లక్ష్మారెడ్డి రైతు సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.