కాలనీలో మౌలిక వసతులు... ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి.
కాలనీ అభివృద్ధియే ప్రధాన ధ్యేయం.
న్యూ అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షుడిగా శ్రవణ్ కుమార్.
జవహర్ నగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కాలనీలోని మౌలిక వసతులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాలనీ అభివృద్ధి ప్రధాన ధ్యేయమని న్యూ అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ న్యూ అంబేద్కర్ కాలనీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా న్యూ అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షుడుగా శ్రవణ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కాలనీలోని మౌలిక వసతుల కల్పనకు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, కాలనీ అభివృద్ధి ఏ ధ్యేయంగా పనిచేస్తామని, కాలనీలోని మౌలిక వసతులైన డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్తు, తదితర ప్రజల కనీస అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా కాలనీ నూతన కమిటీ సభ్యుల వివరాలను శ్రవణ్ కుమార్ అందించారు. కాలనీ గౌరవ అధ్యక్షులుగా కుతాడి సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా శివరాత్రి భాస్కర్, ఉపాధ్యక్షులుగా మారయ్య మందస్వామి మేడ రమ శ్రీదేవి కోశాధికారిగా టి. భాస్కర్ సంయుక్త కార్యదర్శి నరసింహ సలహాదారులుగా యాదగిరిరావు రామకృష్ణ శ్రీనివాసరావు వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నాగరాజు శంకర్ రేవతి రాణి మంజుల లలిత చిలుకనిర్మల శంకర్ యాదవ్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాలనీవాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.






