calender_icon.png 22 February, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ బంద్ ప్రశాంతం

22-02-2026 01:40:39 AM

ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ

స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు

పోలీసు బలగాలతో భారీ బందోబస్తు 

అల్లర్లకు కారకులైన 12 మంది అరెస్టు 

రెచ్చగొట్టే వారిని వదిలిపెట్టం: ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి/బాన్సువాడ, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఇరువర్గాల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, రాళ్లతో దాడుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డారు. అర్ధరాత్రి వరకు ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ వేదికకగా ఆందోళనకు దిగ డం గమనార్హం. ఎస్పీ రాజేష్ చంద్ర బాన్సువాడలో మకాం వేసి ఉద్రిక్తత పరిస్థితులను సద్దుమణిగేలా చేశారు.

శనివారం బీజేపీ నాయకులు బాన్సువాడ బంద్‌కు పిలుపు ఇవ్వగా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. శుక్రవారం సాయంత్రం రిలయన్స్ మార్ట్ షోరూమ్‌లో పనిచేస్తున్న ఓ మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా, రాస్తారోకో చేపట్టాయి. మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో ఎస్పీ రాజేష్ చంద్ర బాన్సువాడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేసి ఆందోళనలో విరమింపచేశారు.

శనివారం బంద్ నేపథ్యం లో ముగ్గురు డీఎస్పీలు, 20 మంది సిఐలు, 30 మంది ఎస్సైలు, 200 మంది పోలీస్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కాగా ఉద్రిక్తత పరిస్థితులకు ఆజ్యం పోసి న వారిని గుర్తించి 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మరి కొందరిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.