చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
12-06-2026 01:01 AM
ఆసీస్‌పై వన్డే సిరీస్ కైవసం
ఢాకా, జూన్ 11: బంగ్లాదేశ్ వన్డే జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే వరల్ కప్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిం ది. ఆ జట్టుపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆసీస్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లబూషేన్, బార్ట్ లెట్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. చివరికి ఆస్ట్రేలియా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఛేజింగ్ లో తొలి ఓవర్లోనే బంగ్లా వికెట్ కోల్పోయినప్పటకీ తర్వాత పుంజుకుంది. సౌమ్య సర్కార్ (42), నజ్ముల్ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. తౌహిద్ హృదోయ్ (40), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (22) నాటౌట్‌గా నిలిచి బంగ్లాను గెలిపించారు.






