27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఒరేయ్ నీకెందుకురా..? హీరోలా ఫీలవ్వకు.. ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేష్ కౌంటర్

04-06-2026 12:11 PM

నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి?

హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy Chief Minister), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Janasena Chief Pawan Kalyan)పై సెటైర్లు వేసిన ప్రకాశ్ రాజ్(Prakash Raj)పై నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి'' అంటూ ప్రకాశ్ రాజ్ ఎక్స్ పోస్టు చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.

''నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!” అంటూ బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు.