27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

ఇండియన్ సినిమాలో ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్ ఇది

04-06-2026 12:00 AM

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు ‘సింగ్ గీతం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై నాగ్‌అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అహల్యా బమ్రూ విలేకరులతో సినిమా విశేషాలు పంచుకుంది. “-మాది పుదుచ్చేరి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, బెంగాలీ వంటి భాషలు మాట్లాడే ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగా. యాక్టర్ అవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటా. నా ఆడిషన్ కూడా ఇన్‌స్టా ద్వారానే ఇచ్చా (నవ్వుతూ). నాకు తెలుగు రాదు.

తొలిరోజు సెట్స్‌లో -చాలా భయపడ్డా. సినిమా ప్రారంభానికి ముందే నేను ఆన్‌లైన్‌లో తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టా. ఇది చాలా కొత్త జానర్‌లో రూపొందిన సినిమా. ఇలాంటి సినిమాను మీరు ఇంతవరకు చూసి ఉండరు. సంగీతం నేపథ్యంలో ఉండే సినిమా. నాకు పాటలు పాడటం, గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. సింగీతం శ్రీనివాసరావు తీసిన చిత్రాలన్నీ కాలానికి ముందున్నవే. ‘సింగ్ గీతం’ అలాంటి సినిమానే. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్ ఇది. సింగీతం సినిమాల్లో మహిళా పాత్రలు చాలా బలంగా, స్వతంత్రంగా ఉంటాయి. ఇందులో నా పాత్ర  సాధారణ క్లాసికల్ హీరోయిన్ పాత్ర కాదు.

తనకు ఏం కావాలో నా పా త్రకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్ర. ఇందులో విలన్ పాత్ర కూడా ఒక అమ్మాయే చేస్తోంది. ఇది చాలా అరుదైన విషయం. ఈ కథ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. దేవిశ్రీప్రసాద్ జీనియస్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలు చాలా యూనిక్‌గా ఉంటాయి. -నాగ్‌అశ్విన్.. సింగీతం గారికి అభిమాని. ఆయన అభిరుచి కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. -నాకు సౌత్ ఇండియా అంటే చాలా ఇష్టం. సినిమాలను ప్రేమించే ప్రేక్షకులున్న పరిశ్రమలో పనిచేయడం ఆనందంగా ఉంది. -నాకు యాక్షన్ చాలా ఇష్టం. భవిష్యత్తులో అలాంటి పాత్రలు చేస్తా. -ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నా.