27 July, 2026 | 7:49 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

సిగ్మా స్టుల్ ఇది!

05-06-2026 12:00 AM

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ను లాంచ్ చేశారు. తమన్ స్వయంగా స్వరపర్చి, ఆలపించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ మాస్ బీట్‌లతో అదిరిపోయింది. సందీప్ కిషన్ తన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, ఫారియా అబ్దుల్లా కూడా అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్‌తో పాటకు మరింత అందం తీసుకొచ్చింది.

జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.