లూపస్‌పై అప్రమత్తత అవసరం
డాక్టర్ మమత పనతుల
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): మే 10న ‘ప్రపంచ లూపస్ దినోత్సవం’ సందర్భంగా జీవీకే హెల్త్ హబ్ ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ మమత పనతుల వెంకటేష్ లూపస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ‘ప్రతి రోజూ ఒక అడుగు ముందుకు‘ అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ వ్యాధి పట్ల అవగాహన, అప్రమత్తత ఉంటేనే దానిని జయించడం సాధ్యమని ఆమె పేర్కొన్నారు. లూపస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేయడం వల్ల ఈ సమ స్య తలెత్తుతుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. అయితే, పురుషులతో పోలిస్తే మ హిళల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉం టుంది. ప్రతి 9 మంది మహిళలకు ఒక పు రుషుడు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దీనికి హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన మరియు పర్యావరణ కారణాలు ప్రధానమని డాక్టర్ వివరించారు. వ్యాధిని ముందుగా గుర్తించ డం ద్వారా అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని ఆమె తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం లూపస్ కు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మన దే శంలో ’బయోసిమిలర్’ మందుల లభ్యత పె రగడం వల్ల సామాన్యులకు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. ‘డయాబెటిస్, బీపీ లాగే లూపస్ బాధితులు కూడా నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు.






