బండి రమేష్ జన్మదిన వేడుకలు
కూకట్‌పల్లి, జులై 15 (విజయక్రాంతి) : కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, టిపిసిసి ఉపాధ్యక్షులు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ జన్మదిన వేడుకలను కూకట్ పల్లి లోని ఎన్ కె ఎన్ ఆర్ గార్డెన్స్ లో బుధవారం ఘనంగా జరిగాయి. వసంత్ నగర్ డివిజన్ అధ్యక్షులు కిలారు శ్రీనివాస బాబు, కాంగ్రెస్ నాయకులు చావా శ్రీనివాసరావు, మాకినేని వినోద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో బండి రమేష్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
అనంతరం అభిమానులు ఏర్పాటుచేసిన 60 కిలోల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ తనపై చూపుతున్న ప్రేమ ఆదరాభిమానాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ జన్మదినాన్ని కేవలం సంబరంగా కాకుండా ప్రజాసేవకు అంకితమయ్యే సంకల్ప దినంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్మ సంఘాలనాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






