9 June, 2026 | 5:47 PM

ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులుగా బండారు రాజా

09-06-2026 04:36 PM

నియామకం పట్ల హర్షం

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట పట్టణానికి చెందిన  బండారు రాజా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మంగళవారం నియామకమయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. బండారు రాజా గతంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం జిల్లా ఆర్యవైశ్య మహాసభ  క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకముతో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యక సభ్యులుగా నియమించిన అమరవాది లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.

జిల్లాలో ఆర్యవైశ్యుల అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులుగా నియామకమైన సందర్భంగా శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్, తాటికొండ సీతయ్య బండారు దయాకర్, ఈగ లక్ష్మయ్య, గోపారపు సత్యనారాయణ, తల్లాడ కేదారి ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఈగ నాగన్న, వాసవి సేవా సమితి అధ్యక్షులు పోలవరపు సంతోష్, తో పాటు పలువురు  ఆర్య వైశ్యులు అభినందనలు తెలిపారు.