9 June, 2026 | 5:46 PM

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం

09-06-2026 04:39 PM

పేటచెర్వు గ్రామసభలో పాల్గొన్న కొత్వాల

పాల్వంచ,(విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి సాధ్యం అవుతుందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం కొత్తగూడెం కార్పొరేషన్ 9వ డివిజన్ పేటచెర్వులో జరిగిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు. 

 రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలను చేపడుతున్నదని, గ్రామా సభలు నిర్వహించి, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న NFBS, ఆసరా ఫించన్లు, ఒంటరి మహిళా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రూపు మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణి చేశారు.