29 July, 2026 | 1:44 PM

చిల్డ్రన్ హోమ్ నుండి ఇద్దరు బాలికల అదృశ్యం

29-07-2026 12:49 PM

సుల్తానాబాద్, జులై 29 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో ఉన్న చిల్డ్రన్ హోమ్(childrens home) నుండి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు, మంగళవారం రాత్రి మిరియాల ఉమామహేశ్వరి (16), సుశీల ఆకృతి (08) గోడ దూకి వెళ్లిపోయినట్లు సూపరిటెండెంట్ వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు, బాలికల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ రంజిత్ రావ్ , ఎస్సై చంద్రకుమార్ లు బుధవారం తెలిపారు, ఎవరికైనా  బాలికల ఆచూకీ  తెలిసినచో సుల్తానాబాద్ ఎస్సై 8712656511,  సీఐ 8712656510 కు వెంటనే సమాచారం అందించాలని  పోలీసులు విజ్ఞప్తి చేశారు.