22 July, 2026 | 3:32 AM

నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

21-07-2026 12:10 AM

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్, జూలై 20 (విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఆలయ పరిసరాలలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.

మండపం ఏర్పాటు, భారీకేడ్ ల ఏర్పాటు, ట్రాఫిక్ డైవర్షన్‌ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు నగరం నుండే కాకుండా మన రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పారు.

దీనిని దృష్టి లో ఉంచుకుని వివిధ శాఖల అధికారులు, ఆలయ పరిసరాలలోని ప్రజల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే వెంట ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, ఇవో వినోద్‌రెడ్డి, దేవాదాయశాఖ డీసీ రామకృష్ణ, ఏసిపి రాఘవేందర్, వాటర్ వర్క్స్ డిజిఎమ్ ఆశిష్ ఉన్నారు.