ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదు
ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు విశాఖ ఇండస్ట్రీ సిబ్బందుల మారారు.
జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్...
ఆదిలాబాద్,(విజయక్రాంతి): క్యాతనపల్లి మున్సిపాలిటీలో(Kyathanpally Municipality) మంత్రి వివేక్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు కేవలం 7 స్థానాలు వస్తే ఛైర్మన్ పీఠం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు. క్యాతన పల్లి మున్సిపల్ ఎన్నికల గొడవ కేసులో 15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) జైల్లో ఉన్న ఆయన బడా బెయిల్ పై విడుదల అయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన సుమన్ కు మాజీ జైలు నుంచి బయటకు వచ్చిన సుమన్ కు మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna), బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జైలు బయట సుమన్ మీడియాతో మాట్లాడుతూ... మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు, అటు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా, విశాఖ ఇండస్ట్రీస్(Visaka Industries) సిబ్బందిలా పనిచేస్తున్నారని ఆరోపించారు.




