వాట్సాప్ లో ఏం పెట్టావు రా అని కొట్టారు
వారి నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసిన బాధితుడు సంతోష్ కుమార్
నిందితులను కఠినంగా శిక్షించాలి: హిందూ సంఘాల నేతలు
కేసు నమోదు చేశాం.. 9 మంది ని అరెస్టు చేశాం : ఎజాజోద్దిన్, టూ టౌన్ సీఐ
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నగరంలోని ఓ యువకుడిని ముస్లిం యువకులు ఒక్కసారిగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితులు సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మెట్టుగడ్డ దగ్గర మాకు ఒక బట్టల షాపు ఉంది. ఈనెల 1వ తేదీన ఇటీవల ఇరాన్ ఇజ్రాయిల్(Iran-Israel war) మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇరాన్ దేశం మిలటరీ రక్షణ శాఖ మంత్రి ఖమేని మరణించిన విషయాన్ని సోషల్ మీడియాలో అనుచితంగా పెట్టడం జరిగిందని కొందరు ముస్లిం యువకులు ఒక్కసారిగా షాప్ దగ్గరికి వచ్చి ఎందుకు సోషల్ మీడియాలో అలా పెట్టావురా అంటూ కిందపడేసి ఒక్కసారిగా కొట్టారు.
మీ కాళ్లు మొక్కుతా నన్ను కొట్టకండి దయచేసి క్షమించండి అంటే కూడా ఎవరు వినలేదు. మరికొంత సమయం తర్వాత మరింత మంది వచ్చి మరోసారి తీవ్రంగా గాయపరిచారు. మా ఇల్లు ఎక్కడ ఉంది అని కూడా వారు రెక్కీ నిర్వహించినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఈనెల 1వ తేదీని పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను వ్యాపారం చేసుకుని బతికేవాడిని వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది దయచేసి నాకు రక్షణ కల్పించాలని వారి నుంచి నన్ను కాపాడాలని బాధితులు సంతోషకుమార్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
9 మంది ని అదుపులోకి తీసుకున్నాం : సీఐ ఎజాజోద్దిన్
ఈనెల 1వ తేదీనే కేసును నమోదు చేయడం జరిగిందని టూ టౌన్ సీఐ ఎజాజోద్దిన్ విజయక్రాంతి దినపత్రికతో తెలిపారు. ఈ కేసులో భాగంగానే మంగళవారం 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలియజేశారు.
ఆందోళన చేసిన హిందూ సంఘాలు...
ఈ ఘటనకు సంబంధించి హిందూ సంఘాల నేతలు ఒక్కసారిగా ఈ విషయం తెలియడంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చేసి ఆందోళన చేపట్టారు. ఈ దేశం లో ఉన్న ముస్లింలంతా ఈ దేశానికి సంబంధించిన వారిని పక్క దేశం వారి గురించి ఏం మాట్లాడిన ఇక్కడ ఉన్న వారికి ఎందుకు కోపం వస్తుందో అర్థం కావడంలేదని హిందూ సంఘాల నేతలు కిరణ్ కుమార్ రెడ్డి, పాండురంగారెడ్డి, మెట్టు కాడ శ్రీనివాసులు లతోపాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాయంత్రం వరకు నిందితులను పట్టుకొని హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సంబంధం లేని విషయంలో ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లిం సోదరులు ఎందుకు అసహన వ్యక్తం చేస్తున్నారు అర్థం కావడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలకు తావు ఇవ్వడం వల్ల ఇటువైపు ఉన్న వ్యక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని పోలీసులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు.
చట్టంపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టే పోలీసులు బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశంలో ఉన్న ముస్లింలంతా ఈ దేశానికి సంబంధించిన వారేనని ఎవ్వరు కూడా ఇలాంటి ఘటనలను ప్రోత్సహించకూడదన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడ్డప్పుడే మరో మరో ఇలాంటి ఘటనలు జరిగావని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పోలీసులపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టే అన్ని విషయాలను వారి ముందు ఉంచి మౌనంగా ఉన్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు.




