13 May, 2026 | 3:11 AM

రేపటి నుంచి బడిబాట

13-05-2026 12:00 AM

జూన్ 19 వరకు కార్యక్రమం నిర్వహణ

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): ఈనెల 14 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టనున్నది. బడీడు పిల్లలను 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఈనెల 14న పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని, 21న అంగన్వాడీ టీచర్లు, మథర్స్ కమిటీతో, 28న యువత, నాయకులతో సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు సూచించారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైనప్పుడు పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.