ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుంది
22-04-2026 04:41 PM
పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం
చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచితoగా పుస్తకాలు, భోజనం, స్కాలర్షిప్, దుస్తులు వంటి ఎన్నో సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని పెద్దగాపర్తి గ్రామ సర్పంచ్ కాటన్ వెంకటేశం పేర్కొన్నారు. బుధవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కాటo వెంకటేశం హాజరై ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోని చదివించాలని విన్నవించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచితoగా పుస్తకాలు, భోజనం, స్కాలర్షిప్, దుస్తులు వంటి ఎన్నో సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






