15 June, 2026 | 8:15 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

8న బాబా శ్యామ్ భారీ రథ్ యాత్ర

07-02-2026 12:00 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): బాబా శ్యామ్ కు అత్యంత ఇష్టమైన ఫాల్గుణ మాసం ఫిబ్రవరి 8 న వేలాదిమంది భక్తులతో శ్రీ బాబా శ్యామ్ భారీ రథ యాత్రను నిర్వహిస్తున్నట్లు బాబా శ్యామ్ రథశోభ యాత్ర కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్ అగర్వాల్, వైస్ చైర్మన్లు రామ్దేవ్ అగర్వాల్, పురుషోత్తం దాస్ గోయల్‌లు తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాత్రకు సంబందించిన వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యాత్ర చార్మినార్, మహాదేవ్ ఆలయం నుండి ప్రారంభమై, ఆఫ్జాల్ గంజ్, గౌలిగూడ, చాదర్ ఘాట్, నింబోలి అడ్డా మీదుగా కాచిగూడలోని వీరన్న గుట్ట శ్రీ శ్యామ్ మందిర్ కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో చంద్రకాంత్ డకోటియా, అమిత్, రాంనిరంజన్, సంతోష్, నర్సింగ్, జీవన్ భాటి, అభిషేక్ శర్మ, సుశీల్, గోవింద్ పొద్దార్, చంద్రకాంత్ డకోటియా, కృష్ణ కుమార్ బడేగావ్వాలే, ఇంద్రకరణ్, రామ్దేవ్, రాజ్కుమార్ విగ్, కపిల్ పాల్గొన్నారు.