దొంగతనాలు జరగకుండా అవగాహన
త్రీ టౌన్ సీఐ లక్ష్మీ బాబు
కొండపాక, మే 17: దొంగతనాలు జరగకుండా అందరు బాధ్యతాయుతంగా ఉండి, గుర్తించాలని 3 టౌన్ సిఐ లక్ష్మీ బాబు అన్నారు. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో దొంగతనాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆదివారం రాత్రి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
రాత్రి సమయాల్లో బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి గొలుసులను ఎత్తుకుపోయే దొంగల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలు ప్రాముఖ్యత గురించి వివరించి వాటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామాలలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే 100 కు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






