09-02-2026 12:00:00 AM
లక్షెట్టిపేట టౌన్, ఫిబ్రవరి 8 : లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆదివారం పట్టణంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు లక్షెట్టిపేట తహసిల్దార్, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.