29 April, 2026 | 10:50 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

న్యూక్లియర్ మెడిసన్‌పై అవగాహన పెరగాలి

27-04-2026 12:00 AM

బసవతారకం వైద్యులు డాక్టర్ జాకిర్ అలీ

బంజారాహిల్స్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): న్యూక్లియర్ మెడిసన్ తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విభాగం. దీని ద్వారా పీఈటీ-సీటీ లాంటి వ్యవస్థలను వినియోగించి పలు రోగాలను కచ్చితత్వంతో నిర్దారించవచ్చు. ఈ విభాగం పట్ల వైద్యుల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని బసవతారకం క్యాన్స ర్ హాస్పిటల్ న్యూక్లియర్ మెడిసన్ విభాగం హెడ్ డాక్టర్ జాకిర్ అలీ అన్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కలిపి న్యూక్లియర్ మెడిసన్ పై ప్రత్యేక సదస్సును హాస్పిటల్లో ఆదివారం నిర్వహించారు. అడ్వానస్డ్ డయా గ్నస్టిక్ టెక్నిక్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్న పేరుతో నిర్వహించిన ఈ సదస్సును బసవతారకం అకాడమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్ తోలికి అలీ ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో న్యూక్లియర్ మెడిసన్ విభాగం వైద్యులు, టెక్నాల జిస్టులు, ఫిజిస్టులు, విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన 180 మందికి పైగా వైద్యు లు, న్యూక్లియర్ మెడిసన్ టెక్నాలజిస్టులు, న్యూక్లియర్ ఫిజిస్టులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.