30 April, 2026 | 12:13 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేసుకోవాలి

27-04-2026 12:00 AM
  1. కార్మికులకు... పట్టణ ఉపాధి పథకాలు వర్తింపజేయాలి
  2. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చింతకింది అశోక్

జవహర్ నగర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): జవహర్ నగర్ ప్రాంత పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డులో తమ పేరును విధిగా నమోదు చేసుకోవాలని, భవన నిర్మాణ కార్మికులకు పట్టణ ఉపాధి పథకాలు వర్తింపజేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింతకింది అశోక్ డిమాండ్ చేశారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం సిఐటియు జవహర్ నగర్ డివిజన్ జవహర్ నగర్ నాయకుడు టి. నగేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింతకింది అశోక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులందరూ వెల్ఫేర్ బోర్డులో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 

అనంతరం కాప్రా సర్కి ల్ జవహర్ నగర్ భవన నిర్మాణ కార్మికుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ అధ్యక్షులుగా డి నాగేష్ ఉపాధ్యక్షులుగా చం ద్రశేఖర వర్మ,  రాము, కార్యద ర్శిగా చింతకింది అశోక్, సహాయ కార్యదర్శిగా బాబు, శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా లింగాల కవిత, కొమరయ్య, మహేందర్, ఆర్గనైజర్‌గా కుమార్, రాము వీరితో పాటు కమిటీ సభ్యులుగా యాదగిరి, లింగయ్య, రాజు, లక్ష్మణ్, బలరాం, నాగరాజు, రాము లు, నర్సింగ్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.