28 August, 2026 | 3:36 AM

డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ

28-08-2026 01:10 AM

పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ 

సికింద్రాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఓం శాంతి బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో  సే నో టు డ్రగ్స్  నషా ముక్త్ భారత్‌అనే నినాదంతో మాదకద్రవ్యాల ని ర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహి ంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ హాజరయ్యారు.

బ్రహ్మకుమరిస్ ఇంచార్జ్ ఉమ ఆధ్వర్యంలో  బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్ నుండి హస్మత్పేట్ అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు.

త్రివర్ణ పతాకంతో సాగిన ర్యాలీ హస్మత్పేట్ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, మాదకద్రవ్యాల రహిత భారత నిర్మాణానికి ఐక్య సందేశాన్ని అందించింది.ఈ సందర్భంగా ముద్దం నర్సింహ యాదవ్ గారు మాట్లాడుతూ, డ్రగ్స్ అనేది యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టే అత్యంత ప్రమాదకరమైన సామాజిక రుగ్మత అని అన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలవు తున్న యువతను కాపాడుకోవడం ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతి నిధులు, సమాజం బాధ్యత అని పేర్కొన్నారు.