30 August, 2026 | 2:04 AM

సికింద్రాబాద్‌లో ‘వాక్‌ఫ్రీ’పై అవగాహన

30-08-2026 12:12 AM

ఉర్గో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ

రక్తనాళాల్లో సమస్యలతో వచ్చే పుండ్లకు.. ఆధునికి చికిత్సే కీలకం: డాక్టర్ నరేంద్ర మేడా

హైదరాబాద్, ఆగస్టు29 (విజయక్రాంతి): దేశంలో సుమారు 22 లక్షల నుంచి 65 లక్షల మంది వరకు కాళ్లలోని సిరలకు సంబంధించిన సమస్యల కారణంగా వచ్చే దీర్ఘకాలిక పుండ్లతో బాధపడుతున్నట్లు అంచనాలు ఉన్నప్పటికీ.. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహ న తక్కువగా ఉందని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హా స్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ నరేంద్రమేడా అన్నారు.

ఈ నేపథ్యం లో సిరల సంబంధిత కాళ్ల పుండ్లపై అవగాహన కల్పించేందుకు ఉర్గో ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వాక్‌ప్రీ’ కార్యక్రమాన్ని సి కింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభించారు. భారతదేశంలో ఈ కార్యక్రమానికి ఇదే తొలి అవగాహన కార్యక్రమం. రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్య నిపుణులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్ట ర్ మేడా మాట్లాడుతూ సిరల్లో రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కాళ్ల పై ఏర్పడే పుండ్లు దీర్ఘకాలం మా నకపోవచ్చు. దాదాపు 40 శాతం మంది రోగుల్లో రెండు నుంచి నాలుగేళ్ల వరకు పుండ్లు కొనసాగుతున్నట్లు అంచనాలు చెబుతు న్నాయి. ఒకసారి మానిన తర్వాత కూడా తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఐదేళ్లలో 70 శాతం వరకు పుండ్లు మళ్లీ ఏ ర్పడే అవకాశం ఉందని తెలిపారు.

‘కాళ్లపై ఏర్పడే పుండ్లను సాధారణ గాయాలుగా భావించకూడదు. ఇవి దీర్ఘకాలం కొనసాగడంతోపా టు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. రోగులు చికిత్సను సక్రమంగా పాటించడం, వ్యాధిపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం’ అని తెలిపారు. కాగా రోగులు, కు టుంబ సభ్యులు వైద్య నిపుణులను తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. వెరికోస్ వెయిన్స్ తదితర సిరల సమస్యలతో వచ్చే దీర్ఘకాలిక కాళ్ల పుండ్లపై అవగాహనను కేవలం ఆసుపత్రులకే పరిమి తం చేయకుం డా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ‘వాక్‌ఫ్రీ’ కార్యక్రమం లక్ష్యమని ఉర్గో ఫౌండేషన్ ప్రతినిధు లు తెలిపారు.

వ్యాధిని తొలిదశలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం, వైద్యుల సూచనలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా పుండ్ల తీవ్రతను తగ్గించడంతో పాటు తిరిగి వచ్చే అవకాశాలను నియంత్రించవచ్చన్నారు. అవగాహన.. క్రమం తప్పని చికిత్స.. సరైన సంర క్షణతో దీర్ఘకాలిక కాళ్ల పుండ్ల నుంచి బయటపడేందుకు మరింత మంది రోగులకు సహాయపడట మే ‘వాక్‌ఫ్రీ’ లక్ష్యమని నిర్వాహకులన్నారు.