30 June, 2026 | 9:23 PM

Breaking News

చమురు,గ్యాస్ సంరక్షణపై అవగాహన

03-02-2026 12:54 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): చమురు, గ్యాస్ పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో దేశవ్యాప్త సక్షమ్  2026 కార్యక్రమం సికింద్రాబాద్ బోయినపల్లి మనోవికాస్ నగర్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్  ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సర్కిల్ పీఈఎస్‌ఓ జాయింట్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్పో్లజివ్స్ వీకే మిశ్రా, గౌరవ అతిథి గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సైకియాట్రీ & డిప్యూటీ డైరెక్టర్ (ఐ/సి),

ఎన్‌ఐఇపిఐడి శ్రవణ్ రెడ్డి,చమురు మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర అధిపతులు ఐఒసిఎల్ పీయూష్ మిట్టల్, హెచ్ పిసిఎల్ సుశీల్ కుమార్ రాయ్ ,బిపిసిఎల్ నీలేష్ వైచల్, గెయిల్ దేవ్ కాంత్ సిన్హా హాజరయ్యారు.ఈ సందర్భంగా వీకే మిశ్రా మాట్లాడుతూ ఇంధన పొదుపు అవసరాన్ని తెలియజేస్తూ, విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించడంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు,ఎన్‌ఐఈపిఐడి వంటి సంస్థల సమిష్టి కృషిని అభినందించారు.