calender_icon.png 6 February, 2026 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

06-02-2026 07:42:15 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని విద్యావర్ధిని పాఠశాల విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టంపై ఇన్స్పెక్టర్ దుర్గ  అవగాహన నిర్వహించారు. ఈవ్ టీజింగ్, ఆకతాయిల వేధింపులు, ఇతర అవాంఛనీయ సంఘటనలు, పిల్లలకి భరోసా సెంటర్ అందించే సేవల వివరాలు, నేరాలకు విధించే శిక్షలు, సోషల్ మీడియా వల్ల లాభనష్టాలు, విద్య ప్రాముఖ్యం గురించి వివరించారు. డయల్ 100, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి , హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ , సుధాకర్ , షీ టీమ్ సిబ్బంది , పాఠశాల హెడ్ మాస్టర్ మోహన్ పాల్గొన్నారు.