23 April, 2026 | 1:36 AM

ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు

23-04-2026 12:40 AM
  1. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్‌ను హైకోర్టు సమర్థించింది
  2. ఈ తీర్పు పూర్తిగా ప్రొసిజరల్, టెక్నికల్ అంశం
  3. ప్రాజెక్టు కుంగుబాటును తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
  4. హైకోర్టు తీర్పుతో సీబీఐ విచారణకు ఎలాంటి ఇబ్బంది లేదు
  5. తీర్పు కాపీ వచ్చాక ప్రభుత్వం తదుపరి చర్యలు
  6. నేడు జరిగే క్యాబినెట్ నిర్ణయిస్తుంది
  7. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా మానవ తప్పిదం
  8. దేశంలోనే ఇది అతిపెద్ద విధ్వంసం
  9. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కాళేశ్వరంపై హైకోర్టులో వచ్చిన తీర్పు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, అందుకు బాధ్యులైన వారెవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.6 కొట్టి వేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని, కానీ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పు బట్టకపో గా కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని తెలిపారు.

కమిషన్ ఫైండింగ్స్‌ను కూడా హైకోర్టు తప్పుబట్టలేదని, కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకా రం జీవో నెం.6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని కోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ‘కమిషన్ ఏర్పాటు అధికార పరిధిని మిం చింది కాదు.. అసమంజసం కాదు, అక్రమం కాదు’ అని కూడా వెల్లడించినట్టు తెలిపారు.

జ్యుడీషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్ధారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని, పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసు ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్ని తప్పుబట్టిందని, జ్యుడీషియల్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని పిటిషనర్లకు రిలీఫ్ ఇచ్చినట్లు తెలిపిందని పేర్కొన్నారు. ఇప్పటికే మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని నిర్ణయించిందని, సీబీఐకి లేఖ కూడా రాసినట్టు గుర్తు చేశారు.

తాజాగా వెలువడిన హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తరువాత తదుపరి చర్యలపై నేడు జరిగే క్యాబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది నిజమని, ప్రాజెక్టుకు ఎంచుకున్న సైట్ నుంచి డిజైన్ల నుంచి నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్ల అవకతవకలు జరిగడంతోపాటు అన్నీ లోపాలే ఉన్నాయని తెలిపారు.

వారికి నోటీసులు ఇవ్వలేదనే కారణంగా, వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్స్ మాత్రమే ఇన్ ఆపరేటివ్‌గా ఉంటాయని హైకోర్టు తెలిపడం పూర్తిగా ప్రొసిజరల్, టెక్నికల్ అంశమని వివరించారు. కాళేశ్వరం ప్రజల కళ్లముందే కుంగిపోయిందని, 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగిబాటు అక్కడి కి వెళితే ఎవరికైనా కనబడుతుందని పేర్కొన్నా రు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల తో కట్టిన బ్యారేజీ మూడేండ్లకే వాళ్ల హయాంలోనే కుంగిపోయిందని, అందుకు కారణాలే మిటో తేల్చాల్చిన బాధ్యత..

మా ప్రజాప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభు త్వం అధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారి తీసిన కారణాలు, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాథమిక నివేదికను బీఆర్‌ఎస్ హయాంలోనే  సమర్పించిందన్నారు. బ్యారేజీలకు ఎంచుకున్న ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్ బయటపెట్టిందని గుర్తు చేశారు. 

యథాతథంగా సీబీఐ విచారణ

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇంజనీర్లను, ఐఏఎస్‌లను, అప్పటి పరిపాలనా బాధ్యులను విచారించి తమ నివేదికను వెల్లడించిందని, బాధ్యులెవరు, దోషులెవరు.. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి.. ఏమేం లోపాలున్నాయి.. ఎన్డీఎస్‌ఏతో పాటు విజిలెన్స్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలపై ఆగస్ట్ నెలలోనే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికల ఆధారంగా దర్యాప్తు జరపాలని సీబీఐ విచారణకు ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పుతో సీబీఐ విచారణకు సంబంధం లేదని, ఆ విచారణ యథాత థంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రెండేండ్లుగా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదని, ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాధ్యులెవరో ప్రజల ముందు నిలబెడుతాం

కేవలం రెండు ఫిల్లర్లు కాదు.. మొత్తం పౌండేషన్.. మొత్తం మూడు బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నాయని ఇప్పటికే దేశంలో పేరొందిన సం స్థల నిపుణులందరూ అభిప్రాయపడ్డారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వివరిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా మాన వ తప్పిదం.. దేశంలోనే ఇది అతిపెద్ద విధ్వంసం.. అమూల్యమైన ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు. దీనికి బాధ్యులెవరో ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.